Memes: ఆఫీస్‌కు ఈదుకుంటూనే వెళ్లాలి.. చెన్నై వర్షపాతంపై మీమ్స్‌ చూశారా?

చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మీమర్లు అనేక మీమ్‌లు సృష్టిస్తున్నారు. ఆఫీస్‌కు ఈదుకుంటూ వెళ్లడం ఒక్కటే మార్గం, మా వీధిలో నది.. మా ఇంట్లో సరస్సు లాంటి మీమ్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి......

Published : 09 Nov 2021 01:29 IST

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని చెన్నై నగరం, దాని శివారు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. 2015 తర్వాత ఆ స్థాయిని గుర్తుకు తెచ్చేలా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించారు. తమిళనాడులో అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణంకంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం చెన్నైలో దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఇంకా వర్షాలు కురుస్తుంటడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటినుంచి ట్విటర్‌లో #ChennaiRain ట్రెండింగ్‌లో ఉంది. మీమర్లు సైతం అనేక మీమ్‌లు సృష్టిస్తున్నారు. ఆఫీస్‌కు ఈదుకుంటూ వెళ్లడం ఒక్కటే మార్గం, మా వీధిలో నది.. మా ఇంట్లో సరస్సు లాంటి మీమ్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని