హరితహారం: చివరిస్థానంలో జీహెచ్‌ఎంసీ

తెలంగాణలో ఆరో విడత హరితహారం కింద 11.78కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ దఫా లక్ష్యం 29.86 కోట్ల మొక్కల్లో ఇప్పటి వరకు 39.46శాతం పూర్తయినట్లు పేర్కొంది. నిర్దేశించిన లక్ష్యంలో 96.52 శాతంతో కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో

Updated : 20 Jul 2020 18:11 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఆరో విడత హరితహారం కింద ఇప్పటి వరకు 11.78కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ దఫా లక్ష్యం 29.86 కోట్ల మొక్కల్లో ఇప్పటి వరకు 39.46శాతం పూర్తయినట్లు పేర్కొంది. నిర్దేశించిన లక్ష్యంలో 96.52 శాతంతో కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో ఉందని ప్రభుత్వం తెలిపింది. 70శాతానికిపైగా కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాలు, 60శాతానికిపైగా మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 24.82శాతంతో వరంగల్‌ అర్బన్‌, 12.61శాతంతో హెచ్‌ఎండీఏ ఉన్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 5.25 శాతంతో చివరిస్థానంలో జీహెచ్‌ఎంసీ నిలిచింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని