296 మొబైల్‌ యాప్‌లు నిషేధించాం: కేంద్రం 

2014 నుంచి ఇప్పటిదాకా 296 మొబైల్‌ యాప్‌లను బ్లాక్‌ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతను.....

Updated : 04 Feb 2021 18:52 IST

దిల్లీ: 2014 నుంచి ఇప్పటిదాకా 296 మొబైల్‌ యాప్‌లను బ్లాక్‌ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రె రాజ్యసభలో వెల్లడించారు. ఐటీ చట్టం- 2000లోని 69ఏ సెక్షన్‌ నిబంధనల ప్రకారం ఈ యాప్‌లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వేదికల్లో లభ్యమవుతున్న కొన్ని చైనా యాప్‌లు సమాచారాన్ని తస్కరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నాయన్న సమాచారం మేరకు ఈ నిషేధం విధించినట్టు చెప్పారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యతో పాటు యాప్‌లు, వెబ్‌సైట్ల సంఖ్య కూడా బాగా పెరిగినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2019ను తీసుకొచ్చిందని, అయితే, ఇది జేపీసీ పరిశీలనలో ఉందన్నారు. ఈ బిల్లు ద్వారా భారత పౌరుల  సమాచార గోప్యత, ప్రయోజనాలకు రక్షణ లభిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి..

ప్రపంచవ్యాప్తంగా 4,000 కొత్త కరోనా రకాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని