AP News: ప్రకాశంలో జంబలకిడిపంబ!

అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారడం వినగానే టక్కున గుర్తొచ్చేది ‘జంబలకడి పంబ’ సినిమానే. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది....

Published : 23 Jun 2021 01:20 IST

పెద్దారవీడు: అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారడం వినగానే టక్కున గుర్తొచ్చేది ‘జంబలకడి పంబ’ సినిమానే. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లి గ్రామంలో గుమ్మా ఆవులయ్య కుమారుడు అంకయ్య వివాహం అరుణ అనే యువతితో జరిగింది.   పెళ్లి తరువాత పోలేరమ్మ, అంకాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వరుడు వధువులా.. వధువు వరుడి వేషధారణతో తప్పెట్లు, తాళాలతో గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు, నాగులపుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తమ వంశంలో పూర్వకాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అంకయ్య కుటుంబసభ్యులు తెలిపారు. గుమ్మా ఇంటి పేరున్న వారు తమ ఇళ్లల్లో వివాహం జరిగితే ఈ ఆచారాన్ని పాటిస్తారని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని