TS News: సంక్రాంతి వేళ టోల్‌ ప్లాజాలకు భారీగా ఆదాయం

సంక్రాంతి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో టోల్‌ప్లాజాలకు భారీగా ఆదాయం సమకూరింది. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌

Updated : 19 Jan 2022 08:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో టోల్‌ప్లాజాలకు భారీగా ఆదాయం సమకూరింది. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వెళ్లేందుకు పలు జాతీయ రహదారులను దాటాలి. ఆయా జాతీయ రహదారులపై రాష్ట్ర పరిధిలోని 28 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలున్నాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ దఫా రాకపోకలు అధికంగా జరిగాయి. పండుగ మూడు రోజుల్లో గడిచిన ఏడాది టోల్‌గేట్ల వద్ద 6.26 లక్షల లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది ఆ సంఖ్య 7.55 లక్షలకు చేరింది. ఒక్క హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలోని టోల్‌ప్లాజాల వద్ద 3.78 లక్షల లావాదేవీలు జరిగాయి. మొత్తం ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది రూ.11.72 కోట్ల ఆదాయం లభించింది. గడిచిన ఏడాది రూ.9.49 కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఫాస్టాగ్‌ వినియోగం 97.36 శాతంగా ఉంది. గడిచిన ఏడాదిలో ఇది 81.36 శాతం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని