Konijeti Rosaiah: రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది.

Updated : 05 Dec 2021 15:08 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. తొలుత ఆయన పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని స్వగృహం నుంచి గాంధీభవన్‌కు తరలించారు. అక్కడ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. 

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయానికి అక్కడ నివాళులర్పించారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రోశయ్య భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో తూంకుంట పురపాలక సంఘం పరిధి దేవరయాంజల్‌లోని వ్యవసాయక్షేత్రంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని