AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం.. పర్యాటకులకు నో పర్మిషన్‌

విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది.

Published : 06 Dec 2021 01:24 IST

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో సమీపంలోని చిల్డ్రన్‌పార్కులో ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నోవాటెల్‌ హోటల్‌ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్‌ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని