Konijeti Rosaiah: కొంపల్లి ఫాంహౌస్‌లో రేపు రోశయ్య అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

Updated : 04 Dec 2021 15:01 IST

హైదరాబాద్‌ : అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు కొంపల్లి దేవరయంజాల్ ఫాం హౌస్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేత కేవీపీ వెల్లడించారు. రోశయ్య అస్వస్థత విషయం తెలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. ఫోన్‌లో కుటుంబసభ్యులను ఓదార్చారని వెల్లడించారు. దిల్లీ నుంచి ఏఐసీసీ బృందాన్ని హైదరాబాద్‌కు పంపిస్తానని ఆమె అన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని