singapore: నర్సుల కొరతతో సింగపూర్‌ సతమతం 

కొవిడ్‌ మహమ్మరి విరుచుకుపడినప్పటి నుంచి విపరీతమైన పని ఒత్తిడిని తట్టుకోలేక ప్రపంచమంతటా

Updated : 26 Nov 2021 09:19 IST

రాజీనామా చేసి వెళ్లిపోతున్న విదేశీ సిబ్బంది 
పని ఒత్తిడి భరించలేక ఉద్యోగం వీడుతున్న స్వదేశీయులు 

సింగపూర్‌: కొవిడ్‌ మహమ్మరి విరుచుకుపడినప్పటి నుంచి విపరీతమైన పని ఒత్తిడిని తట్టుకోలేక ప్రపంచమంతటా ఎందరో వైద్యులు, నర్సులు రాజీనామాలు చేశారు. చిన్న దేశమైన సింగపూర్‌కు దీని తాకిడి మరీ ఎక్కువగా ఉంది. అక్కడ ఒక ప్రైవేటు ఆస్పత్రుల గ్రూపు.. అనుభవం ఉన్న నర్సును తీసుకురాగల సిబ్బందికి నగదు బహుమానం ప్రకటించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో అనుభవజ్ఞ నర్సుకు 12,000 సింగపూర్‌ డాలర్లు, కొత్తగా శిక్షణ పూర్తిచేసుకుని వచ్చే నర్సుకు 3,600 సింగపూర్‌ డాలర్ల చొప్పున చెల్లిస్తామని ఆ గ్రూపు ప్రతిపాదించింది.

గత ఏడాది 500 మంది విదేశీ వైద్యులు, నర్సులు రాజీనామా చేసి వెళ్లిపోగా.. 2021 ప్రథమార్థంలోనే 500 మంది రాజీనామా చేశారని ఆరోగ్య శాఖ సీనియర్‌ సహాయ మంత్రి జానిల్‌ పుదుచేరి చెప్పారు. రాజీనామాల వల్ల మిగతా సిబ్బందికి పని భారం పెరిగిపోతోంది. రోజులో ఎక్కువ కాలం ఆస్పత్రుల్లోనే పనిచేయవలసి రావడం వీరిపై శారీరక, మానసిక ఒత్తిడి పెంచుతోంది. పనిభారం, మానసిక శారీరక ఒత్తిళ్లు పెరిగిపోవడం వల్ల స్వదేశీ, విదేశీ నర్సులు ఉభయులూ రాజీనామా బాట పడుతున్నారు. విదేశీ నర్సులు స్వకుటుంబాలను కలుసుకోవడానికి సంవత్సరంలో కొన్ని రోజులు స్వదేశాలకు వెళ్లేవారు. కొవిడ్‌ ఆంక్షలు, లాక్‌డౌన్‌ల వల్ల ఆ స్వల్పకాల పర్యటనలూ బంద్‌ అయిపోవడం కూడా వారిని రాజీనామాలకు పురిగొల్పుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని