Covaxin: కొవాగ్జిన్‌ తయారీలో ఎదురైన సవాళ్లకు అక్షరరూపం

యావత్‌ ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారికి ప్రస్తుతం సమర్థంగా ముకుతాడు వేయగలుగుతున్న కొవాగ్జిన్‌ టీకాను ..

Published : 24 Nov 2021 11:51 IST

దిల్లీలో ‘గోయింగ్‌ వైరల్‌: మేకింగ్‌ ఆఫ్‌ కొవాగ్జిన్‌- ది ఇన్‌సైడ్‌ స్టోరీ’ పుస్తకావిష్కరణ
 ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

దిల్లీ: యావత్‌ ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారికి ప్రస్తుతం సమర్థంగా ముకుతాడు వేయగలుగుతున్న కొవాగ్జిన్‌ టీకాను దిగ్గజ కంపెనీ భారత్‌ బయోటెక్‌తో కలిసి తాము దేశీయంగా అభివృద్ధి చేయడంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ‘గోయింగ్‌ వైరల్‌: మేకింగ్‌ ఆఫ్‌ కొవాగ్జిన్‌- ది ఇన్‌సైడ్‌ స్టోరీ’ పేరుతో ఆయన రాసిన పుస్తకాన్ని దిల్లీలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భార్గవతో పాటు దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్, కేంద్ర ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్న విజయ్‌ రాఘవన్, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డాక్టర్‌ కృష్ణ ఎల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌ తయారీ సాకారమవడంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఎంత కీలక పాత్ర పోషించిందో తెలియజేశారు. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు సంబంధించి సిసలైన విజయగాథగా తమ టీకా అభివృద్ధి ప్రక్రియను అభివర్ణించారు. పరస్పర గౌరవం, విశ్వాసం, పారదర్శకత ఆధారంగా తాము ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో 8 నెలల కంటే తక్కువ కాలంలోనే కొవాగ్జిన్‌ను తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతలా కష్టపడ్డారో తాజా పుస్తకంలో భార్గవ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని