Trains: ఇక పాత నంబర్లతోనే రైళ్లు

ప్రత్యేక రైళ్లను ఇక కొవిడ్‌కు ముందు మాదిరిగానే నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించింది.

Updated : 17 Nov 2021 07:38 IST

తక్షణమే అమల్లోకి: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక రైళ్లను ఇక కొవిడ్‌కు ముందు మాదిరిగానే నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘రైల్వే కాలపట్టిక- 2021’లో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు మారిన రైలు నంబర్ల వివరాల్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించింది. 76 రైళ్లకు ప్రత్యేక నంబర్లకు ముగింపు పలికి రెగ్యులర్‌ రైళ్లుగా మార్చింది. ఈ మేరకు ఆయా రైళ్ల జాబితాను విడుదల చేసింది.

నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌-గోరఖ్‌పూర్‌ల మధ్య ఆరు ప్రత్యేక రైలు ట్రిప్పులు

ఈనాడు, హైదరాబాద్‌: నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 21, 28 తేదీల్లో, సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 22, 29న.. హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు 19న, గోరఖ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 21న ఒకటి చొప్పున మొత్తం ఆరు ప్రత్యేక రైలు ట్రిప్పులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని