దిల్లీవాసులు మెచ్చే రాజ్‌కచోరి!

రాజ్‌కచోరి.. దీన్నే ‘కింగ్‌ ఆఫ్‌ కచోరి’ అనికూడా అంటారు. దిల్లీవాసులు సాయంకాలం ఎంతో ఇష్టంగా దీన్ని ఆరగిస్తుంటారు. దీన్ని పూరీలతో

Published : 14 Feb 2021 00:12 IST

పొరుగు రుచి

రాజ్‌కచోరి.. దీన్నే ‘కింగ్‌ ఆఫ్‌ కచోరి’ అనికూడా అంటారు. దిల్లీవాసులు సాయంకాలం ఎంతో ఇష్టంగా దీన్ని ఆరగిస్తుంటారు. దీన్ని పూరీలతో తయారుచేస్తారు. పూరీ మధ్యలో రంధ్రం చేసి దాంట్లో ఉడికించిన బంగాళాదుంప, వేయించిన జీడిపప్పు, బఠానీలు, మరమరాలు, పుట్నాలపప్పు, కాస్త చింతపండు గుజ్జూ వేస్తారు. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, మిర్చీసాస్‌, కొద్దిగా పెరుగు వేస్తారు. చివరగా దానిమ్మ గింజలు, కారప్పూసతో దీన్ని అలంకరిస్తారు. అటూఇటూగా దీని తయారీ పానీపూరీలాగానే అనిపించినా దీంట్లో దట్టించే పదార్థాలు కొంచెం ఎక్కువే ఉంటాయి. సాయంకాలం కాస్త పుల్లగా, మరికాస్త కారంగా ఉండే రాజ్‌కచోరీని తింటూ.. రోజంతా పడిన కష్టాన్ని క్షణాల్లో మర్చిపోతారట ఆహార ప్రియులు. ఇదంతా విన్న తర్వాత... దీన్నో చూపు చూడాలని మీకూ అనిపిస్తోంది కదూ...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని