న్యాయపోరాటంపై టిక్‌టాక్‌ ఏమన్నదంటే?

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించిన

Published : 03 Jul 2020 02:14 IST

న్యూదిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. కేంద్ర తీసుకున్న నిర్ణయంపై అత్యధిక శాతం మంది హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టిక్‌టాక్‌ న్యాయపరంగా పోరాటం సాగించనుందని వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై టిక్‌ టాక్‌ స్పందించింది. అలాంటి నిర్ణమేదీ ఇంకా తీసుకోలేదని స్పష్టం చేసింది.

‘భారత ప్రభుత్వంపై టిక్‌టాక్‌ న్యాయపరంగా పోరాటం చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మాకు అలాంటి ఆలోచనలు ఏవీ లేవు’ అని టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘మేము ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం అమలు పరిచే నియమ, నిబంధనలకు లోబడి ఉంటాం. మా వినియోగదారుల భద్రత, సౌర్వభౌమత్వానికి మా ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది’ అని టిక్‌టాక్‌ తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని