మంచి అలవాట్లకు కారణమైన కరోనా!

చైనాలో పుట్టి ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ మనుషుల్లో కొంత మార్పుకూ కారణమవుతోంది. జీవన శైలి, ఆహార అలవాట్లు, ఆధ్మాత్మికత, మానసిక వైఖరిలో మార్పులు తీసుకొస్తోంది. కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇంటికెళ్లిన కొందరు పెద్ద వయస్కులు చెబుతున్న సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.....

Published : 19 Jun 2020 19:33 IST

కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వృద్ధుల్లో మార్పులు

ఔరంగాబాద్‌: చైనాలో పుట్టి ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ మనుషుల్లో కొంత మార్పునకూ కారణమవుతోంది. జీవన శైలి, ఆహార అలవాట్లు, ఆధ్యాత్మికత, మానసిక వైఖరిలో మార్పులు తీసుకొస్తోంది. కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇంటికెళ్లిన కొందరు పెద్ద వయస్కులు చెబుతున్న సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.

మహారాష్ట్ర ఔరంగాబాద్‌ పట్టణంలోని కొవిడ్‌-19 బాధితులు తమ జీవితం, వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులను వివరించారు. ‘సాధారణంగా నా వయసు వ్యక్తులు జీవనశైలి మార్చుకొనేందుకు ఇష్టపడరు. కానీ, కరోనా వైరస్‌ నా పాత అలవాట్లను మార్చుకొనేలా చేసింది. నాకు సరిపడనప్పటికీ దశాబ్దాలుగా నేను డైట్‌ను మార్చుకోలేదు. వైరస్‌ సోకిన తర్వాత మార్చాలని నిర్ణయించుకున్నా. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా. మారుతున్న పరిస్థితులకు కూడా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా’ అని 66 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆయన కొలుకొని డిశ్చార్జి అయ్యారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి గడప దాటకున్నా తనకెలా వైరస్‌ సోకిందో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని 60 ఏళ్ల వృద్ధురాలు తెలిపారు. మధుమేహంతోనూ బాధపడుతున్న ఆమె జూన్‌ 1న ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లింది. ‘నేనిప్పుడు మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన జీవితం గడపాలని భావిస్తున్నా. ప్రస్తుతం పోషక విలువలు ఉన్న ఆహారాన్నే తింటున్నా. గతంలో నేనెప్పుడూ వీటి గురించి ఆలోచించలేదు. ఇకపై మారే రుతువులను బట్టి ఆహారం తీసుకుంటా. మరింత సమయం నాతో నేనే గడుపుతా. క్వారంటైన్‌, చికిత్సా సమయంలో నేను ఆధ్మాత్మికత వైపు మళ్లాను’ అని పేర్కొన్నారు.

నేటి యువతకు చాలా విషయాలు మెరుగ్గా తెలుసని 61 ఏళ్ల మహిళ అంగీకరించారు. కొవిడ్‌-19 తర్వాత తనలో కలిగిన మార్పులను వివరించారు. ‘సాధారణంగా ఏ ఇంట్లోనైనా పెద్దలు చెప్పిందే పిల్లలు వినాలని అంటారు. కానీ, యువతరానికి ఈ ప్రపంచం గురించి మన కన్నా బాగా తెలుసని గుర్తించాలి. వారి మాట మనం వినాలి. గతంలో నేనిలా ఆలోచించలేదు. కరోనాకు ముందు విరామం లేకుండా తినేదాన్ని. ఇప్పుడు కొంత విరామం ఇచ్చి ఆహారాన్ని తీసుకుంటున్నా. ఇదిప్పుడు అలవాటుగా మారింది’ అని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని