ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ ఉదయం నగరంలోని శర్మ కళాశాల, అంబేడ్కర్‌ భవన్‌ తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్లలోంచి బయటకు  పరుగులు తీశారు.

Updated : 05 Jun 2020 11:28 IST

ఒంగోలు పట్టణం: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ ఉదయం 10.15 గంటలకు నగరంలోని శర్మ కళాశాల, అంబేడ్కర్‌ భవన్‌, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్లలోంచి బయటకు  పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

శుక్రవారం ఉదయం ఏపీతో పాటు కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో రిక్టర్‌ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ఎలాంటి నష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని