10 లక్షల మంది తరలింపు: రైల్వే

శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సమారు 10 లక్షలమంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించినట్టు రైల్వేశాఖ గురువారం పేర్కొంది. ఇందుకు గానూ 806 రైళ్లను వినియోగించినట్టు........

Published : 14 May 2020 22:17 IST

దిల్లీ: శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సమారు 10 లక్షలమంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించినట్టు రైల్వేశాఖ గురువారం పేర్కొంది. ఇందుకు గానూ 806 రైళ్లను వినియోగించినట్టు తెలిపింది. మే 2న మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని, వీటిలో ఎక్కువశాతం బిహార్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన రైళ్లే ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా రాష్ట్రాల పరస్పర అంగీకారంతో కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టి వలసకార్మికులను సురక్షితంగా చేరవేస్తున్నామని తెలిపారు.

రైలులో ప్రయాణించే వారందరికీ ఉచిత భోజనం, మంచినీరు ఏర్పాట్లు రైల్వే శాఖే చేపట్టిందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు ఒక్కో రైలులో 1200 మందిని తరలిస్తుండగా సోమవారం నుంచి  1700 మంది వలస కార్మికులను తరలించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. వీరి టికెట్టు ఛార్జీలను కేంద్రప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 85:15 నిష్పత్తిలో భరిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని