Updated : 11/05/2020 20:08 IST

రేపట్నుంచే రైళ్ల కూత.. బుకింగ్‌లో మార్పులివీ!

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపట్నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడపాలన్న కేంద్రం ఆదేశం మేరకు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీలనే.. ఇప్పుడు నడిపే ప్రత్యేక రైళ్లకు కూడా వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ మేనేజర్లకు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని స్టేషన్లలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్థానికంగా ప్రచారం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

రైల్వే బోర్డు నిర్ణయాలివీ... 
> ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం
> ప్రత్యేక రైళ్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి
> ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్‌కు అనుమతులు ఉండవు
> ఏడు రోజుల ముందుస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది
> కేవలం ఖరారైన టికెట్లు మాత్రమే జారీ చేస్తారు
> వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టికెట్లు జారీ చేయరు

> ఆన్‌లైన్లో మాత్రమే టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం
> టికెట్‌ను 24గంటల ముందుగా రద్దు చేసుకోవాలి. 50% రుసుము మాత్రమే తిరిగి చెల్లిస్తారు. 
> ఫుడ్‌ ఆన్‌ పేమెంట్‌ ప్రాతిపదికన మాత్రమే ఐఆర్‌సీటీసీ ఆహారం సరఫరా చేస్తుంది. అది కూడా డ్రై, రెడీ టు ఈట్‌ వంటి పదార్థాలను వాటర్‌ బాటిల్‌ను మాత్రమే ఇస్తారు. ఎవరి ఆహారాన్ని వాళ్లే తెచ్చుకోవడం దీని వెనుక ఉద్దేశం.
> టికెట్ బుకింగ్ సమయంలోనే ఐఆర్‌సీటీసీలో ఆహారం బుక్‌ చేసుకునే సదుపాయం.
> గతంలో రాజధాని రైళ్లలో కల్పించిన దుప్పట్లు, టవల్స్ సరఫరాను ఈ ప్రత్యేక రైళ్లలో ఇవ్వడం లేదు.

ఇవీ చదవండి

రైలెక్కాలంటే ప్రయాణికులకు ఇవి తప్పనిసరి!

రేపటి నుంచి 15 రైళ్ల ప్రారంభం


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని