వలస కూలీల కోసం 40 ప్రత్యేక రైళ్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికోసం 40 ప్రత్యేక రైళ్లను నడపాలని

Published : 05 May 2020 00:50 IST

హైదరాబాద్: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికోసం 40 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాను కోరారు. వలస కార్మికుల సమస్యలపై ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యేక రైళ్లద్వారా వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని నిర్ణయించారు.

రేపటి నుంచి వారం రోజులపాటు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతోపాటు వరంగల్‌, ఖమ్మం, రామగుండం, దామర చర్ల నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమై  బిహార్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమబంగాల్‌ వరకు నడుస్తాయన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పలు పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే కూలీలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా పేర్లు నమోదు చేసుకున్నవారిని ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తామని సీఎం అన్నారు. తరలింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, కూలీలు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వ ఏర్పాట్లపై కూలీలకు వివరించాలని పోలీసులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని