ఎన్‌పీఆర్‌లో ఆ ఒక్క కాలమ్‌తో సమస్య: భట్టి

ఎన్‌పీఆర్‌ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్‌ దేశ ప్రజల దృష్టికి సభ ద్వారా తీసుకొచ్చారని సీఎల్పీ నేత మల్లు  భట్టివిక్రమార్క అన్నారు....

Updated : 16 Mar 2020 15:09 IST

హైదరాబాద్‌: ఎన్‌పీఆర్‌ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్‌ దేశ ప్రజల దృష్టికి సభ ద్వారా తీసుకొచ్చారని సీఎల్పీ నేత మల్లు  భట్టివిక్రమార్క అన్నారు. సమస్య పరిష్కారం కోసం అందరం ఏకం కావాలని చెప్పారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. తీర్మానాన్ని బలపరుస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశంలో వివిధ కులాలు, మతాల ప్రజలు జీవిస్తున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో చాలా మందికి ఈ ధ్రువీకరణ పత్రాలు లేవు. ప్రమాదకరమైన ఎన్‌పీఆర్‌ను కేంద్రం తీసుకొచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశంలో ఉన్న అన్ని మతాల వారికీ సంబంధించిన సమస్య. చొరబాటుదారులను దేశంలోకి అనుమతించాలని ఎవరూ చెప్పరు. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. తీర్మానం చేయడంతోనే సరిపెట్టుకోకుండా రాష్ట్రంలో అమలుచేయబోమని చట్టం తీసుకురావాలి. కేంద్రం మన తీర్మానం పరిగణనలోకి తీసుకొని ఎన్‌పీఆర్‌లో ఆ కాలమ్‌ను తొలగించాలని కోరుతున్నా. ఎన్‌పీఆర్‌ను 2010లో చేపట్టినా దాంట్లో తల్లిదండ్రుల పుట్టుకకు సంబంధించిన వివరాలను సేకరించలేదు. కానీ, ఎన్‌పీఆర్‌ 2020లో మాత్రం తల్లిదండ్రులు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు అనే వివరాలను అడిగే కాలమ్‌ పెట్టడం ప్రమాదకర సంకేతం’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని