పరీక్ష చేయించుకోమంటే తప్పించుకెళ్లాడు!

దుబాయ్‌ నుంచి మంగళూరుకు చేరుకున్న ఓ వ్యక్తి కోసం ఆరోగ్య అధికారులు గాలించడం చర్చనీయాంశంగా మారింది. అతడికి కరోనా లక్షణాలు ఉండటమే అందుకు కారణం. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు.

Published : 10 Mar 2020 02:09 IST

బెంగళూరు: దుబాయ్‌ నుంచి మంగళూరుకు చేరుకున్న ఓ వ్యక్తి కోసం ఆరోగ్య అధికారులు గాలించడం చర్చనీయాంశంగా మారింది. అతడికి కరోనా లక్షణాలు ఉండటమే అందుకు కారణం. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడికి కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలు ఉండటంతో వెంటనే పరిశీలనార్థం, తదుపరి పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లిన తర్వాత తనకు కరోనా సోకలేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం కొద్ది సేపటికి ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. దీంతో వైద్యాధికారులు పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. అనంతరం పోలీసులు అతడిని వెతికే పనిలో పడ్డారు. జిల్లా వైద్యాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 43కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి సైతం పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ఆ చిన్నారి ఇటీవల ఇటలీ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని