ఈ ‘హ్యాండ్‌ వాష్‌ డ్యాన్స్’ చూశారా..?

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ను చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా దూరం పెట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.....

Published : 07 Mar 2020 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ను చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా దూరం పెట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఎంత సేపు కడుక్కోవాలి.. అన్న అంశాల్ని వివరిస్తూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వియత్నాంకు చెందిన ఇద్దరు డ్యాన్సర్లు ఇటీవల చేసిన ‘హ్యాండ్‌ వాష్‌ డ్యాన్స్‌’ అందరినీ ఆకట్టుకుంటోంది. లయబద్ధంగా వస్తున్న పాటకు స్టెప్పులు వేస్తూ చేతుల్ని శుభ్రం చేసుకునే విధానాన్ని టిక్‌టాక్‌ వేదికగా వివరించారు. వీరి ప్రయత్నాన్ని యూనిసెఫ్‌ అభినందించింది.

‘‘వీరు చేసిన హ్యాండ్‌ వాషింగ్‌ డ్యాన్స్‌ మాకు బాగా నచ్చింది. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం తీసుకోవాల్సిన తొలి జాగ్రత్త సబ్బుతో చేతులు కడుక్కోవడమే’’ అంటూ ట్విటర్‌లో వారి వీడియోను షేర్‌ చేసింది. మరి ఆలస్యం ఎందుకు మనమూ ఓ లుక్కేద్దామా..! చూడ్డమే కాదు.. తరచూ చేతులు శుభ్రం చేసుకొని వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకుందాం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని