మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

ప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది..

Published : 01 Feb 2020 15:31 IST

హైదరాబాద్‌: ప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌- వరంగల్‌ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయని, ఇవి మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే వివరించింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్- వరంగల్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య మరో 10 రైళ్లు నడవనున్నాయి. ఇవి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, జమ్మికుంట, కొత్తపల్లి, కొలనూర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని