తుళ్లూరులో ప్రారంభమైన వాహన ర్యాలీ

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు  43వ రోజు కొనసాగుతున్నాయి. అమరావతి ఐకాస పిలుపు మేరకు

Updated : 29 Jan 2020 12:10 IST

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు  43వ రోజు కొనసాగుతున్నాయి. అమరావతి ఐకాస పిలుపు మేరకు తుళ్లూరు నుంచి మందడం వరకు చేపట్టిన భారీ వాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతుకూలీలు, మహిళలు పాల్గొన్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాదిగా జనం ఈ ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు ఈ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాల గుండా ప్రదర్శన కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదు లింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ప్రదర్శన తిరిగి తుళ్లూరు చేరుకోనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని