పదేళ్లు టికెట్‌ కొన్నాడు.. జాక్‌పాట్ వరించిందిప్పుడు!

దుబాయిలో షాప్‌కీపర్‌గా పనిచేసే ఓ ప్రవాస భారతీయుడిని జాక్‌పాట్‌ వరించింది. దాదాపు పది సంవత్సరాల నుంచి అతడు ఇన్‌ఫినిటి మెగా రాఫిల్‌ లాటరీ టికెట్లు కొంటుండగా.. అదృష్టం ఇప్పుడు తలుపు తట్టింది.

Published : 22 Jan 2020 01:43 IST

అబుదాబి: దుబాయిలో షాప్‌కీపర్‌గా పనిచేసే ఓ ప్రవాస భారతీయుడిని జాక్‌పాట్‌ వరించింది. దాదాపు పది సంవత్సరాల నుంచి అతడు ఇన్‌ఫినిటి మెగా రాఫిల్‌ లాటరీ టికెట్లు కొంటుండగా.. అదృష్టం ఇప్పుడు తలుపు తట్టింది. దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ 25వ ఎడిషన్‌లో ఆ లాటరీని గెలుచుకున్నాడు. ఇందులో భాగంగా అతడు ఒక లగ్జరీ కారు, 2లక్షల దిర్హమ్‌ (రూ.13లక్షల నగదు)బహుమతి సాధించినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. 

లాటరీ విజేత శ్రీజిత్‌ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. ఏదో ఒక రోజు అదృష్టం నన్ను వరిస్తుందనే భావనతో దాదాపు పదేళ్లుగా రాఫిల్‌ లాటరీ కొంటున్నాను. ఈ గెలుపు ద్వారా నా కలలు నెరవేరనున్నాయి. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నగదు వారి భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది’ అని వివరించారు. దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌లో ఇన్‌ఫినిటి సంస్థ అక్కడికి వచ్చే సందర్శకులకు క్యూఎక్స్‌50 కారు, 2లక్షల దిర్హమ్‌లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ లాటరీలో పాల్గొనాలనుకునే వారు దాదాపు 200 దిరహమ్‌లు పెట్టి లాటరీ కొనాలి. అదేవిధంగా ప్రతిసారి దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌లో లక్కీ షాపర్‌ బహుమతి కూడా ఇస్తారు. ఈ బహుమతి పొందే వ్యక్తికి ఫెస్టివల్‌ చివరి రోజున 1మిలియన్‌ దిరహమ్‌(దాదాపు రూ.2కోట్లు) నగదు ఇస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని