గజరాజా లేవవా.. ఏనుగుల అరణ్యరోదన.. 

కేరళలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. తోటి ఏనుగు నిర్జీవంగా పడి ఉండగా.. మరో గజరాజు దాన్ని లేపడానికి యత్నించింది.

Published : 17 Nov 2021 18:16 IST

పాలక్కడ్‌: కేరళలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. తోటి ఏనుగు నిర్జీవంగా పడి ఉండగా.. మరో గజరాజు దాన్ని లేపడానికి యత్నించింది. విద్యుదాఘాతానికి గురై చనిపోయిన ఏనుగును లేపేందుకు ఆ ఏనుగు చేసిన ప్రయత్నం హృదయాల్ని ద్రవింపజేసింది. పాలక్కడ్ జిల్లాలోని మలంపుళాలో సోమవారం రాత్రి విద్యుత్ తీగ తగిలి ఒక మగ ఏనుగు మృత్యువాత పడింది. అది గుర్తించిన తోటి ఏనుగులు.. చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. కాలితో, తొండంతో అటూ ఇటూ తిప్పుతూ లేవమని పిలుస్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు హృదయాల్ని ద్రవింపజేస్తున్నాయి. కొన్ని గంటలపాటు అక్కడే ఉన్న తోటి ఏనుగులు ఎవరినీ ఆ పరిసర ప్రాంతాలకు రానివ్వలేదు. ఆ ఏనుగులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకు వేచి చూసిన అటవీ అధికారులు ఆ తర్వాత.. చనిపోయిన ఏనుగును తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని