హైదరాబాద్‌లో భూప్రకంపనలు..!
మహానగరంలో మరోసారి భారీ శబ్దాలతో కూడిన భూప్రకంపనలు స్థానికులను బెంబేలెత్తించాయి. గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మంగళవారం రాత్రి భూమి కంపించడంతో..
Updated : 15 Oct 2020 07:59 IST
టీఎన్జీఓస్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కంపించిన భూమి
హైదరాబాద్: మహానగరంలో మరోసారి భారీ శబ్దాలతో కూడిన భూప్రకంపనలు స్థానికులను బెంబేలెత్తించాయి. గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మంగళవారం రాత్రి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం రాత్రి 1.30 గంటలకు మొదలై బుధవారం తెల్లవారుజామున 4గంటల వరకు పలుమార్లు భూమి కంపించి, ఇళ్లు అదిరాయని స్థానికులు తెలిపారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గంటకోసారి భారీ శబ్దాలతో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు వారు చెప్పారు. బుధవారం రాత్రి పెద్దస్థాయిలో శబ్దాలు రావడంతో కాలనీవాసులంతా రోడ్ల మీదికొచ్చారు. అక్కడివారి ఫిర్యాదుతో శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలనీవాసులతో మాట్లాడి డీఆర్ఎఫ్ బృందాల్ని అందుబాటులో ఉంచుతున్నామని.. నిపుణులతో మాట్లాడి కారణం తెలుసుకుంటామని భరోసానిచ్చారు.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..