మా ఎమ్మెల్యేని మార్చెయ్‌.. రోడ్డు సమస్య తీర్చు.. మా ఆయన చేత మందు మాన్పించు

భక్తులు ఆలయాలకు వెళ్లి ఎన్నో కోరికలు కోరుతుంటారు. అవన్నీ వారి వ్యక్తిగతం. ఇతరులకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. సాధారణంగా మంచి మార్కులు, ఉద్యోగం రావాలని, మంచి సంబంధం కుదరాలని, ఆర్థిక కష్టాలు తీరాలని మొక్కుతుంటారు. అయితే, కర్ణాటకలోని హసన్‌లో ఉన్న హసనంబా దేవతను నమ్మే భక్తుల్లో కొందరు కొన్ని విచిత్రమైన కోరికలు కోరారు. ఏడాది పొడవునా మూసి ఉండే హసనంబా దేవాలయం ఏటా దీపావళి సందర్భంగా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే తెరుస్తారు. ఇటీవల ఆలయాన్ని తెరవడంతో భక్తులు పొటెత్తారు. తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత ఆలయాన్ని

Published : 11 Nov 2021 01:27 IST

కర్ణాటకలోని ఓ దేవాలయంలో కోరికలు ఏకరుపెట్టిన భక్తులు

బెంగళూరు: భక్తులు ఆలయాలకు వెళ్లి ఎన్నో కోరికలు కోరుతుంటారు. అవన్నీ వారి వ్యక్తిగతం. ఇతరులకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. సాధారణంగా మంచి మార్కులు, ఉద్యోగం రావాలని, మంచి సంబంధం కుదరాలని, ఆర్థిక కష్టాలు తీరాలని మొక్కుతుంటారు. అయితే, కర్ణాటకలోని హసన్‌లో ఉన్న హసనాంబ దేవతను నమ్మే భక్తుల్లో కొందరు కొన్ని విచిత్రమైన కోరికలు కోరారు. ఏడాది పొడవునా మూసి ఉండే హసనాంబ దేవాలయం ఏటా దీపావళి సందర్భంగా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే తెరుస్తారు. ఇటీవల ఆలయాన్ని తెరవడంతో భక్తులు పొటెత్తారు. తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత ఆలయాన్ని యథాతథంగా మూసివేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచి చూడగా.. అందులో భక్తుల కానుకలతో పాటు.. కొన్ని చీటీలు బయటపడ్డాయి. ఓ చీటీలో ఒక భక్తుడు ‘‘అమ్మా.. మా నియోజకవర్గ ప్రజలను కాపాడు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యేని మార్చేయ్‌. ఎన్నికల్లో ఆయన కుటుంబమంతా ఓడిపోయేలా చూడు’’అని రాశారు. 

స్థానికంగా ఉండే మరో భక్తుడు తన ఇంటి అడ్రెస్‌ రాసి.. తన కాలనీ రోడ్డులో గుంతలు పడ్డాయని, ఆ సమస్యను తీర్చాలని కోరుతూ చీటీని హుండీలో వేశాడు. ఇంకొకరు తన కోరికను వెల్లడించలేదు గానీ.. తన కోరికను నెరవేర్చితే రూ.5వేలు ఇస్తానని దేవతకే ఆఫర్‌ ఇచ్చారు. మరో భక్తురాలు తన భర్త మద్యపానం అలవాటును మానుకునేలా చూడమని కోరింది. మరో యువతి తన ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకునేలా దీవించమని ఏకంగా రక్తంతో చీటీ రాసింది. ఇలాంటి విచిత్రమైన చీటీలు చూసి ఆలయ నిర్వాహకులు అవాక్కయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని