Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (23-01-2022)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 23 Jan 2022 04:03 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ముఖ్య పనులను ప్రారంభించండి. సఫలం అవుతాయి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకు సాగాలి. సమయం అన్ని విధాలా సహకరిస్తోంది. అనవసర అంశాల్లో తలదూర్చకండి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.

మిశ్రమ కాలం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి . బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి.  మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

శ్రమ పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సాయం అందుతుంది. విందూవినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే  పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గురు ఆరాధన మేలు చేస్తుంది.

మంచికాలం. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మీ ప్రతిభతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి దర్శనం శుభప్రదం.

గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.

అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల మీద దృష్టి తగ్గించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే  బాగుంటుంది.

 

ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదేవతా శ్లోకాన్ని చదవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని