Endeavour Cow: ఒక్క ఆవు.. రోజుకు 65 లీటర్ల పాలు

హరియాణాలోని ఓ ఆవు రోజుకు ఏకంగా 65 లీటర్ల పాలు ఇస్తూ యజమానికి కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా.. దేశంలో అత్యధిక పాలు ఇచ్చే గోవుల పోటీల్లో ఇటీవల పాల్గొని....

Published : 06 Aug 2021 23:35 IST

కర్నాల్: హరియాణాలోని ఓ ఆవు రోజుకు ఏకంగా 65 లీటర్ల పాలు ఇస్తూ యజమానికి కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా.. దేశంలో అత్యధిక పాలు ఇచ్చే గోవుల పోటీల్లో ఇటీవల పాల్గొని రూ. 5లక్షల బహుమతితో పాటు ఓ పతకాన్ని సైతం కైవసం చేసుకుంది. కర్నాల్ జిల్లా దాదుపుర్ గ్రామానికి చెందిన కుల్‌దీప్‌ సింగ్ వద్ద ఈ ఆవు ఉంది. ఇది పోలాడ్‌లోని ఎండీవర్ రకానికి చెందిన ఆవు జాతిగా కుల్‌దీప్‌ పేర్కొన్నారు.

ఈ ఆవు నుంచి ప్రతి మూడు గంటలకు ఓసారి పాలు పితుకుతూ.. సగటున గంటకు 2.5 లీటర్ల చొప్పున పాలు సేకరిస్తున్నట్లు కుల్‌దీప్ సింగ్  తెలిపారు. ఈ ఒక్క ఆవు పాలతోనే నెలకు రూ. లక్షకు పైగా డబ్బు సంపాదిస్తున్నానని తెలిపిన కుల్‌దీప్‌.. పోటీల్లో పాల్గొన్నప్పుడు వచ్చే డబ్బులు ఇందుకు అదనమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎండీవర్ జాతి ఆవుకు రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని