TS news : రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కేంద్రం ప్రతిపాదనలు : కేసీఆర్‌

కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు  ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

Published : 24 Jan 2022 18:21 IST

హైదరాబాద్‌: కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు  ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం తెలిపారు.

తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్‌ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలను పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ అంశంపై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు