వైన్‌ గ్లాసులతో రైలు పలికించిన సంగీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో జర్మనీకి చెందిన ఓ మ్యూజియం వినూత్నంగా ఆలోచించి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది. దాదాపు మూడు వేల వైన్‌ గ్లాసులను క్రమబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ఫలితంగా ప్రపంచ రికార్డును సొంత చేసుకుంది.

Published : 08 Apr 2021 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో జర్మనీకి చెందిన ఓ మ్యూజియం వినూత్నంగా ఆలోచించి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది. దాదాపు మూడు వేల వైన్‌ గ్లాసులను క్రమబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ప్రపంచ రికార్డును సొంత చేసుకుంది. వైన్‌ నింపిన గాజు గ్లాసుల మధ్య మోడల్‌ రైలు వెళ్లేలా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. దాని ద్వారా సంగీతం వచ్చేలా చేశారు. జర్మనీకి చెందిన వండర్‌ల్యాండ్‌ మ్యూజియం ఈ వినూత్న కార్యక్రమానికి వేదికైంది. లాక్‌డౌన్‌ కారణంగా మ్యూజియం తెరువకపోవడంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నామని నిర్వాహకులు తెలిపారు. సుదీర్ఘమైన శ్రావ్య సంగీతం కోసం కొన్ని వారాలపాటు శ్రమించామని వెల్లడించారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు