Video: వరదనీటిలో కొట్టుకుపోయిన బస్సు

వరద ఉద్ధృతిని అంచనా వేయలేకపోయిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో బస్సు వరదలో కొట్టుకుపోయింది......

Updated : 29 Sep 2021 05:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మహారాష్ట్రలోని యవత్‌మాల్ జిల్లా ఉమర్ ఖేడ్ వద్ద ప్రయాణికుల బస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు నాందేడ్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే మార్గంలో రోడ్డుపై నీరు ప్రవహించగా.. వరద ఉద్ధృతిని అంచనా వేయలేకపోయిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో బస్సు వరదలో కొట్టుకుపోయింది. కొంతదూరం వెళ్లగానే బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. బస్సు కొట్టుకుపోవడం చూసిన గ్రామస్థులు నీటిలో దూకి సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి  చేరుకుని బస్సులో ఉన్న 20మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని