ఒక్కటైన సిర్పూర్‌ అబ్బాయి, నేపాలీ అమ్మాయి

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు ఇతర దేశాలకు రాకపోకలను నిలిపివేశాయి. అలాంటి సమయంలోనూ తమ ప్రేమను నిలుపుకుని ఓ జంట ఒక్కటైంది....

Updated : 05 Jul 2021 05:53 IST

సిర్పూర్‌(టి): కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు ఇతర దేశాలకు రాకపోకలను నిలిపివేశాయి. అలాంటి సమయంలోనూ తమ ప్రేమను నిలుపుకొని ఓ జంట ఒక్కటైంది. కొవిడ్ ఆంక్షలతో అమ్మాయి తల్లిదండ్రులు భారత్‌కు రాలేకపోవడంతో.. అబ్బాయి బంధువులే అమ్మానాన్నలుగా మారి కన్యాదానం జరిపించారు. 

కుమురం భీం జిల్లా సిర్పూర్(టి) మండలానికి చెందిన అచ్యుత్ కుమార్.. ఖతార్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే నేపాల్‌కు చెందిన రమీల అనే యువతితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో అబ్బాయి స్వస్థలంలో వివాహం జరిపాలనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కరోనా వైరస్ విజృంభించి.. దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఆంక్షల నడుమ వరుడు స్వదేశానికి చేరుకున్నాడు. కానీ వధువు నేపాల్‌లోనే ఉండిపోయింది. అయినా ఎలాగైనా ఒక్కటవ్వాలని ఆ జంట భావించింది. అధికారులకు పలు ఆధారాలు చూపించడంతో రమీలతోపాటు తన సోదరుడిని మాత్రమే భారత్‌లోకి అనుమతించారు. వధువు తల్లిదండ్రులకు అనుమతి లభించలేదు. దీంతో వరుడి మేనమామ, మేనత్తలు అమ్మాయికి అమ్మానాన్నలుగా మారి వివాహం ఘనంగా జరిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని