ఆ తెగ ప్రజల్లో చాలా మందివి నీలికళ్లే..!

నీలి రంగులో ఉండే కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, అవి ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందికే ఉంటాయి. అయితే, ఇండోనేషియాకి చెందిన ఓ ప్రాంతంలోని తెగ ప్రజల్లో చాలా మందికి నీలి రంగు కళ్లే ఉండటం విశేషం..........

Published : 10 Oct 2020 00:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నీలి రంగులో ఉండే కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, అవి ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందికే ఉంటాయి. అయితే, ఇండోనేషియాకి చెందిన ఓ ప్రాంతంలోని తెగ ప్రజల్లో చాలా మందికి నీలి రంగు కళ్లే ఉండటం విశేషం. కొర్చొనొయ్‌ పసరిబు అనే ప్రొఫెసర్‌, ఫొటోగ్రాఫర్‌ అక్కడి ప్రజల కళ్లను ఫొటోతీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవెసి ప్రాంతంలో ఉన్న బుటన్‌ ఐలాండ్‌లో బుటన్‌ పేరుతోనే ఓ తెగ ఉంది. అక్కడి ప్రజల్లో పురుషులు, స్త్రీలలో చాలా మందికి నీలిరంగు కళ్లే ఉన్నాయి. అయితే కొందరికి రెండు కళ్లు నీలిరంగులో ఉండగా.. మరికొందరికి ఒక కన్ను నలుపు, మరొకన్ను నీలి రంగులో ఉంది. సాధారణంగా మానవుని జన్యువులో ఆకస్మిక మార్పు వల్ల వచ్చే వార్డెన్‌బర్గ్‌ సిండ్రోమ్‌ అనే సమస్య తలెత్తడం వినికిడి లోపం, జుట్టు, చర్మం, కళ్ల రంగులో మార్పులు వస్తాయట. అయితే, ఈ సిండ్రోమ్‌ ఉన్న బుటన్‌ తెగ ప్రజల కళ్ల రంగు నీలిరంగులోకి మారుతున్నాయి. ఇది చాలా వరకు వారసత్వంగా కొనసాగడంతో అక్కడి ప్రజలందరి కళ్లు నీలిరంగులోనే ఉంటున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పసరిబు ఇటీవల బుటన్‌ వెళ్లి అక్కడి ప్రజల ముఖాలను, కళ్లను ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తున్నారు. అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నా.. వారి ఫొటోలు మాత్రం ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మీరూ ఆ నీలికళ్ల అందాలను చూసేయండి..








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని