బుడతడికి పోలీసు రక్షణ

గుజరాత్‌లోని రెండు నెలల బాలుడికి 24×7 రక్షణ కల్పించనున్నారు స్థానిక పోలీసులు.

Published : 16 Jun 2021 01:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌లోని రెండు నెలల బాలుడికి 24×7 రక్షణ కల్పించనున్నారు స్థానిక పోలీసులు. పుట్టిన రెండు నెలలకే రెండు సార్లు అపహరణకు గురికావడంతో బాలుడిని రక్షించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌, గాంధీనగర్‌లోని అదలాజ్‌ ప్రాంతంలోని మురికివాడలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఏప్రిల్‌ నెలలో మగబిడ్డ జన్మించాడు. పుట్టిన రెండురోజులకే ఆసుపత్రినుంచి ఆ బాలుడు అపహరణకు గురయ్యాడు. పోలీసులు వారంలోగా కిడ్నాప్‌ చేసిన నిందితులను పట్టుకుని బాలుణ్ని దంపతులకు అప్పగించారు. సదరు బాలుడు ఈ నెల 5 తేదీన మరోసారి కిడ్నాప్‌కు గురి అయ్యాడు. మరలా పోలీసులు రంగంలోకి దిగి నాలుగు రోజుల్లో కిడ్నాప్‌ను ఛేదించి బాలుణ్ని రక్షించారు. సీసీ టీవి దృశ్యాల ఆధారంగా  పిల్లలు లేని ఒక జంట బాలుణ్ని కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు కిడ్నాప్‌ అయిన బాలుడికి ఇకమీదట ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని పోలీసులు ఆ దంపతులకు హామీ ఇచ్చారు. బాలుడి రక్షణ కోసం వాళ్లకు స్థిర నివాసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని