Published : 02/06/2021 01:08 IST

Dehydration: నీరు ఎప్పుడు తాగాలి?

ఇంటర్నెట్‌డెస్క్: శరీరానికి తగినంత నీరు అవసరమని నిపుణులు పదే పదే చెబుతున్నారు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలంటున్నారు. కానీ, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవ్వడం, శరీర అవయవాల పనితీరు మందగించడం తదితర సమస్యలు ఎదురవుతాయి. అయితే, నీరు ఎప్పుడు తాగాలి? మన శరీరానికి నీరు అవసరమని తెలుసుకోవడం ఎలా? చాలామంది మనసులో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

ఇలాంటి సందేహాలను చాలా సులభంగా నివృత్తి చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారి పైకిలాగి వదిలితే.. అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లు లెక్క. అలాకాకుండా ముడతలు పడుతూ,  వెంటనే పూర్వస్థితికి రాకపోతే  శరీరం డీ హైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోని. కనీసం గ్లాసు నీటిని తాగాలి. డీహైడ్రేషన్‌కు గురైతే వీలైనంత వరకు నీడలో ఉండేలా జాగ్రత్తపడాలి.

ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి

డీహైడ్రేషన్‌కు గురైన వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. మైకం ఆవహిస్తుంది. కండరాలు నొప్పిస్తాయి. తలనొప్పి మొదలవుతుంది. కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడంలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్‌కు గురవ్వాలని ఏమీ లేదు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య తలెత్తుతుంది.
 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని