కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహిస్తాం

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.  రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని....

Published : 28 Apr 2021 12:47 IST

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నా: సీఎం జగన్‌

అమరావతి : రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.  రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని.. విపత్కర సమయంలోనూ అగ్గిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.  విద్యార్థుల భవిష్యత్‌ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని.. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్‌ అన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని వివరించారు.

‘పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్‌ అనే ఉంటుంది. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనే. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నా. జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పని. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నా’ అని జగన్‌ అన్నారు.

జగనన్న వసతి దీవెన తొలివిడత ఆర్థిక సాయం విడుదల
రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన తొలివిడత ఆర్థికసాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,049 కోట్లు జమ చేశారు. పాలిటెక్నిక్‌, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు సాయం అందించారు. వసతి, ఆహార ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా సాయం అందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని