CM Jagan: ‘ఏపీ సేవ 2.0’ ప్రారంభించిన సీఎం జగన్‌

పాలనలో మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లిలోని

Updated : 27 Jan 2022 16:58 IST

అమరావతి: పాలనలో మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఏపీ సేవ 2.0’ పోర్టల్‌ను జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పలకడానికి అనువుగా ఉండేందుకు పోర్టల్‌కు ‘ఏపీ సేవ’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. గ్రామస్వరాజ్యంలో ఏపీ సేవ పోర్టల్‌ ఓ గొప్ప ముందడుగని చెప్పారు. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ పాదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలను అందిస్తున్నట్లు తెలిపిన సీఎం.. ఈ పోర్టల్‌ ద్వారా రెవెన్యూ, భూపరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను అదనంగా తీసుకొచ్చామన్నారు. మున్సిపాలిటీలకు చెందిన 25, పౌరసరఫరాలకు చెందిన 6, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌ రంగానికి చెందిన 53కు పైగా సేవలు ఈ పోర్టల్‌ కిందికి తీసుకొచ్చినట్లు జగన్‌ వివరించారు. ఏపీ సేవ పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ వేగంగా ప్రభుత్వ పథకాలు అమలవుతాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని