Anand Mahindra: ‘ఈ వీడియోకు కాలం చెల్లుతుందని అనుకోను’

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగించే, ఆలోచన రేకెత్తించే పోస్టులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఆయన ట్విటర్‌ ఖాతాలో మరో స్ఫూర్తిదాయక వీడియోను పోస్ట్‌ చేస్తూ.. తనదైన శైలిలో...

Updated : 09 Nov 2021 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగించే, ఆలోచన రేకెత్తించే పోస్టులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఆయన ట్విటర్‌ ఖాతాలో మరో స్ఫూర్తిదాయక వీడియోను పోస్ట్‌ చేస్తూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానాన్ని జోడించారు. ఓ చిన్నారి పట్టువదలకుండా వాల్‌ క్లైంబింగ్‌(గోడ ఎక్కడం) చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. వెనుక సందేశపూరిత వాక్యాలు వస్తుంటాయి. నెట్టింట్లో ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారింది.

‘ఈ వీడియో కొన్నేళ్ల క్రితం నాటిది. కానీ.. దీనికి కాలం చెల్లుతుందని అనుకోను. ఎప్పటికీ దీన్ని పోస్ట్‌ చేస్తూనే ఉంటా. ప్రత్యేకించి కొన్ని వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధిత లక్ష్యాలు అసాధ్యంగా అనిపించినప్పుడు! ఆ మరుక్షణమే నా భయాలన్నీ తొలగిపోతాయి’ అని ఆనంద్ మహీంద్రా ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఎంతో సందేశాత్మకంగా ఉందంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ‘సోమవారాన్ని ప్రారంభించేందుకు ఇంతకంటే మంచి వీడియో ఉండదు’ అని ఒకరు.. ‘ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదని ఈ బాలుడు నేర్పుతున్నాడు’ అని మరొకరు..  ఇలా వరుస కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని