Air India: గుడ్‌న్యూస్‌.. ఇకపై హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు

హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది.....

Updated : 09 Sep 2021 06:13 IST

హైదరాబాద్‌: లండన్‌కు రాకపోకలు సాగించే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఇకపై హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి విమానం సెప్టెంబర్ 9న హైదరాబాద్ చేరుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ నుంచి లండన్ నాన్‌స్టాప్ విమానం టేకాఫ్ కానుందని వెల్లడించింది.

ప్పటివరకు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, అమృత్‌సర్ నగరాల నుంచే లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉండగా.. ఇకపై హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరనుంది. బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 256 సీట్లతో వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఇందులో 18 బిజినెస్‌ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయంది. భారత్-యూకే సెక్టార్ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిరిండియా అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని