Aadhar: బ్యాంకు ఖాతా స్టేటస్‌ తెలుసుకోండిలా!

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన, ఎల్‌పీజీ సబ్సిడీ లాంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతాకు తప్పని సరిగా లింక్‌ అయ్యి ఉండాలి

Updated : 17 Aug 2022 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన, ఎల్‌పీజీ సబ్సిడీ లాంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతాకు తప్పని సరిగా లింక్‌ అయ్యి ఉండాలి. ఈ తరుణంలో కొందరు లబ్ధిదారులు నగదు తమ బ్యాంకు ఖాతాల్లో పడటం లేదని వాపోతున్నారు. నగదు డిపాజిట్‌ కాకపోవడానికి ఆధార్‌ కార్డుతో బ్యాంకు ఖాతా లింక్‌ కాకపోవడం ఒక కారణం. అయితే బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్‌ అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూనిక్‌ ఐడెండిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడిఏఐ) ఒక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ఆధార్‌ కార్డుకు బ్యాంక్‌ ఖాతా లింక్‌ అయ్యి ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీని కోసం ఏం చేయాలంటే.. 
* ముందుగా మీ కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో https://resident.uidai.gov.in/bank-mapper వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వాలి.
* ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌, సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేసి కింద ఉన్న ‘సెండ్‌ ఓటీపీ’ మీద క్లిక్‌ చేయలి.
* ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపి వస్తుంది. 
* ఓటీపీ నెంబర్‌ను నింపి ‘సబ్మిట్‌’ బటన్‌ నొక్కాలి. వెంటనే  వివరాలు తెరమీద ప్రత్యక్షమవుతాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని