సొరచేప.. మొసలి ఎదురుపడితే.. !!!

రెండూ భారీ జలచరాలే.. రెండూ అత్యంత శక్తిమంతమైనవే కాకుండా క్రూరమైనవి కూడా.. అవి ఒకటి మొసలి అయితే.. మరొకటి బుల్‌ షార్క్‌ జాతికి చెందిన భారీ సొర చేప.. మరి అవి ఒకదానికొకటి ఎదురుపడితే! పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. కొన్ని రకాల నీటిలో నివసించే జీవులు ఎంత ప్రమాదకరమైనవో వార్తల్లో వింటూనే ఉంటాం.. సినిమాల్లోనూ చూశాం. కొందరైతే ప్రత్యక్షంగానూ చూసి ఉండవచ్చు. 

Updated : 28 Nov 2020 13:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రెండూ భారీ జలచరాలే.. రెండూ అత్యంత శక్తిమంతమైనవే కాకుండా క్రూరమైనవి కూడా.. అవి ఒకటి మొసలి అయితే.. మరొకటి బుల్‌ షార్క్‌ జాతికి చెందిన భారీ సొర చేప.. మరి అవి ఒకదానికొకటి ఎదురుపడితే! పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. కొన్ని రకాల నీటిలో నివసించే జీవులు ఎంత ప్రమాదకరమైనవో వార్తల్లో వింటూనే ఉంటాం.. సినిమాల్లోనూ చూశాం. కొందరైతే ప్రత్యక్షంగానూ చూసి ఉండవచ్చు. ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓర్డ్‌ నదిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఓ ఉప్పునీటి మొసలి, బుల్‌ షార్క్‌ జాతికి చెందిన భారీ సొరచేప ముఖాముఖి ఎదురుపడ్డాయి. సొరచేప కాటుకు సుమారు ఆరువేల న్యూటన్ల శక్తి ఉంటుందట. అదే ఉప్పునీటి మొసలికి 16 వేల న్యూటన్ల శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటారు. ఈ భూమి మీద ఉన్న జంతువులన్నింటి కన్నా ఇదే అత్యధికమట. ఈ నేపథ్యంలో మొసలి నిబ్బరంగా నిలిచిపోయింది. దానికి సమీపానికి వచ్చిన షార్క్‌ ఏమనుకుందో ఏమో.. దారి మార్చుకుని పక్కకు తొలిగింది. అది కనుమరుగయ్యే వరకూ అక్కడే ఉన్న మొసలి.. అనంతరం తన దారిన తానూ వెళ్లిపోయింది.

షార్క్‌ చేప సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని.. దాని ఆయుష్షు గట్టిది కాబట్టే సరైన సమయంలో నిర్ణయం తీసుకుని బతికిపోయిందని.. మొసలి పరిమాణంతో పోలిస్తే సొరచేప మూడోవంతు కూడా లేదని నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తాయి. ఆలస్యమెందుకు ఆ తతంగమంతా మీరూ ఈ వీడియోలో చూసేయండి మరి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని