INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

ఒంటికి రంగుపూసుకుని గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న చిన్నారి...

Published : 31 Aug 2020 21:10 IST

ఒంటికి రంగుపూసుకుని గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న చిన్నారి. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద కన్పించిందీ దృశ్యం. తల్లిదండ్రులే చిన్నారులకు రంగుపూసి భిక్షాటనకు పంపిస్తున్నారు. 


తెలంగాణ ఈసెట్‌ పరీక్ష రాసేందుకు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ విద్యార్థిని రెండు నిమిషాలు ఆలస్యం కారణంగా పరీక్షకు అనుమతించలేదు. దీంతో తనను పరీక్షకు అనుమతించాల్సిందిగా పరీక్షా కేంద్రం సిబ్బందిని బతిమాలుతున్న దృశ్యం.


సాధారణంగా మొక్కలను భూమిలో గుంత తీసి నాటుతారు. హైదరాబాద్‌ సమీపంలోని పెద్ద అంబర్‌పేట పురపాలకశాఖ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బండరాళ్లపై ఇనుప డ్రమ్ములు పెట్టి వాటిలో మట్టి, ఎరువు పోసి మొక్కలను నాటుతున్నారు. ఈ విధానంలో కేవలం రావి మొక్కలను నాటుతున్నారు. పెరిగేకొద్దీ మొక్కల వేళ్లు రాళ్ల మధ్యలోని చిన్న చిన్న సందుల్లోకి వెళ్లి బతుకుతాయి.


ఖమ్మంలోని బొమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈసెట్‌ పరీక్షా కేంద్రంలోని వెళ్లేందుకు ఎండలోనే బారులు తీరిన విధ్యార్థులు.


రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. మద్యం దుకాణాల వద్ద తాగడాన్ని ప్రభుత్వం నిషేధించినా హైదరాబాద్‌ జీడిమెట్ల సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద భౌతికదూరం పాటించుకుండా మందుప్రియులు అక్కడే తాగుతున్నారు. 


హైదరాబాద్‌ మల్కాజిగిరి ప్రధాన రహదారిలో హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభంలో ఏర్పాటు చేసిన గణపతి చూపరులను ఆకట్టుకుంటున్నాడు. 


తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి చెట్టుతో పాటు పోటీగా కరివేపాకు చెట్టు ఎదుగుతోంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరు నవభారత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పదేళ్ల క్రితం నాటిన కరివేపాకు మొక్క 24 అడుగుల ఎత్తు పెరిగింది. సాధారణంగా కరివేపాకు చెట్టు 15 అడుగులు మించి పెరగదు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితుల కారణంగా అరుదుగా ఇంత పొడవు పెరిగిందని వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు పాలపర్తి షారా తెలిపారు. 


హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో గణేశుడిని నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని