Published : 29/09/2020 01:19 IST

ప్రపోజ్‌ చేసి నీళ్లలో పడ్డాడు..

ఇంటర్నెట్ డెస్క్‌: ఓ వివాహ ప్రతిపాదన దారుణంగా విఫలమైంది. ఇద్దరికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. తీరంలో పడవలో ఉన్న వ్యక్తి మరో పడవలోని మహిళ వద్దకు వెళ్లి వివాహ ప్రతిపాదనను ఆమె ముందుంచాడు. దానికి సదరు మహిళ  అంగీకారం కూడా తెలుపుతుంది. కానీ అంతలోనే మహిళ ఉన్న పడవ ముందుకెళ్లడంతో ఆమె ఒక్కసారిగా పడిపోతుంది. మరో పడవ అంచుమీద ఉన్న సదరు వ్యక్తి తలకు ఆమె కాలు తాకడంతో అతడు నీటిలో పడిపోతాడు. దీంతో ఆ ప్రతిపాదన కాస్తా ప్రమాదానికి దారితీసినట్లయింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన పలువురు సరదా వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. 
 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని