కూర్చున్న చెట్టునే నరికాడు..వైరల్ వీడియో
ఎవరైనా తనకు తాను అపాయం కలిగించుకునే మూర్ఖమైన పని చేస్తున్నప్పుడు ‘తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు’ అనే సామెతను వాడతాం.
దిల్లీ: ఎవరైనా తనకు తాను అపాయం కలిగించుకునే మూర్ఖమైన పని చేస్తున్నప్పుడు ‘తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు’ అనే సామెతను వాడతాం. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఓ వీడియో కూడా ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. కాకపోతే ఇందులో వ్యక్తి మాత్రం తాను కింద పడకుండా చెట్టు పైభాగాన్ని నరికిన విధానం ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తోంది. అమెరికన్ మాజీ ఫుట్‌బాలర్ రెక్స్ చాప్మన్ ఈ వీడియో షేర్ చేసి, ‘పొడవైన తాటిచెట్టును కత్తిరించడాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చూశారా?’ అంటూ వ్యాఖ్యను జోడించారు.
అందులో ఓ వ్యక్తి చాలా ఎత్తుగా ఉన్న తాటి చెట్టు ఎక్కి, పైభాగాన్ని కోసివేస్తుండటం కనిపిస్తుంది. అతడు దానికొస వరకు ఎక్కడంతో ఆ చెట్టు ఒక పక్కకు ఒరిగిపోయింది. తరవాత దాన్ని రంపంతో కోసేశాడు. ఆకులు ఉన్నంత వరకు తెగిపడిపోవడంతో, కాండం భాగం వేగంగా వెనక్కి, ముందుకు ఊగడం చూస్తే, అతడు కిందపడతాడేమోనని భయమే కలుగుతుంది. కానీ, అతడు మాత్రం నిక్షేపంగా దానిపైనే కూర్చున్నాడు. కాగా, అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈ వీడియోకు నెట్టింట్లో భారీగా లైక్స్ వచ్చాయి.
‘ఎవరైనా ఆ వ్యక్తి చెట్టుపై నుంచి ఎగిరిపడతాడనుకుంటే చేతులు పైకెత్తండి’, ‘ఆయన ఒక్కడే కాదు..చేతిలో రంపం కూడా ఉంది’ అంటూ కామెంట్లు చేశారు. చెట్టు మొదలు నుంచి నరకొచ్చు కదా అని కొందరు అడగ్గా..అంత పొడవైన చెట్టు మొత్తం ఒకేసారి కింద పడితే కరెంటు తీగలు, భవనాలు దెబ్బతింటాయని మరికొందరు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..