62 ఏళ్ల వయస్సులో.. 62.4కి.మీ పరుగు

పుట్టినరోజు వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తుంటారు. ఆరోజును ఎలా జరుపుకోవాలో వారం ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంటారు. కొత్త దుస్తులు ధరించి కేక్‌ కట్‌ చేసి స్నేహితులతో సంతోషంగా గడుపుతుంటారు....

Published : 27 Aug 2020 19:04 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: పుట్టినరోజు వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తుంటారు. ఆరోజును ఎలా జరుపుకోవాలో వారం ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంటారు. కొత్త దుస్తులు ధరించి కేక్‌ కట్‌ చేసి స్నేహితులతో సంతోషంగా గడుపుతుంటారు. కానీ 62 ఏళ్ల జాస్మెర్‌ సింగ్‌ సంధూ అనే వ్యక్తి తన పుట్టిన రోజును విభిన్నంగా జరుపుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వయసు అనేది కేవళం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు. 

ఈనెల 25వ తేదీన జాస్మెర్‌ పుట్టినరోజు. ఆ రోజు వేకువ జామునే లేచి జాగింగ్‌ దుస్తులు ధరించి ఏకంగా 62.4 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. ఈ పరుగును పూర్తి చేయడానికి అతనికి 7 గంటల 32 నిమిషాలు పట్టిందట. పరుగు పూర్తి చేసిన అనంతరం ‘‘నా వయసు కంటే పరుగులో నేను ముందున్నా..’’ అంటూ సంధూ తన ట్విటర్‌లో చమత్కరించారు. ఉదయాన్నే పరుగు తీస్తున్న వీడియోను పోస్టు చేశారు.  

‘‘ఈ రోజు నేను నా జీవితంలో 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ సందర్భంగా 62.4 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశాను. కానీ నా వయస్సు కంటే పరుగులో నేనే ముందున్నా’’ అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ‘వావ్‌’, ‘సూపర్‌’, ‘మీరు అందరికీ ఆదర్శం’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసెయ్యండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని