ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్‌ గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు బయల్దేరాడు...

Updated : 01 Sep 2020 19:48 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్‌ గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు బయల్దేరాడు.భక్తుల నృత్యాలు, జయజయధ్వానాల మధ్య లంబోధరుడు పయనం సాగిస్తున్నాడు. ఈ సారి ఖైరతాబాద్‌ గణపతి ఈ దఫా ‘ధన్వంతరి నారాయణ’గా దర్శనమిచ్చారు. కరోనా కారనంగా కేవలం 9 అడుగుల మట్టి విగ్రహంగా రూపుదిద్దుకున్న ఈ స్వామి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో పాటు కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమ సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కోల్‌కతా ముత్యాలు, గిల్టు వజ్రాల నగలతో స్వామికి గొడుగు రూపొందించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని