గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ గణపయ్య

నగరంలో గణేశ్‌ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు.

Published : 01 Sep 2020 17:48 IST

హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్‌సాగర్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు. 

మరోవైపు పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులతో  ట్యాంక్‌బండ్‌పై సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్‌ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశముంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని