చిన్న కీటకమే.. కానీ భలే గట్టిది..!

కష్టాల్ని భరించిన వాడే విజయంలోని ఆనందాన్ని ఆస్వాదించగలడు. సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లినవాడే ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలడు. ఈ వ్యాఖ్యలకు ఉదాహరణ చూపిస్తూ.. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్ష గొయెంకా స్ఫూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేశారు. అందులో ఓ చిన్న....

Published : 23 Nov 2020 00:40 IST

స్ఫూర్తినింపే వీడియో షేర్‌ చేసిన హర్ష గొయెంకా

న్యూదిల్లీ: కష్టాల్ని భరించిన వాడే విజయంలోని ఆనందాన్ని ఆస్వాదించగలడు. సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లినవాడే ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలడు. ఈ వ్యాఖ్యలకు ఉదాహరణ చూపిస్తూ.. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్ష గొయెంకా స్ఫూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేశారు. అందులో ఓ చిన్న కీటకం చెక్కపై పాకుతూ ముందుకు వెళ్తుంటుంది. మధ్యలో గ్యాప్‌ ఉండటంతో దాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు ఎంతో ప్రయత్నిస్తుంది. కష్టమైనా సరే.. కాస్త సాహసం చేసి.. చివరికి అటువైపుకు చేరుకుంటుంది. అంత చిన్న కీటకానికి ఉన్న పట్టుదల నెటిజన్లలో స్ఫూర్తిని నింపుతోంది.

‘వదిలేయకండి.. ప్రయత్ని'స్తూనే ఉండండి, ఆగిపోకండి.. ముందుకు సాగండి, నిరాశ చెందొద్దు.. నమ్మకంతో ఉండండి. మన సమస్యకు ఓ మార్గం ఎప్పుడూ ఉంటుంది’ అని హర్ష గొయెంకా వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీనికి సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ‘అద్భుతం, మన ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు, లక్ష్యాన్ని సాధించేవరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి, అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందం ఎంతో గొప్పది..’ అంటూ కామెంట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని