ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆదిత్యనాథ్‌ దాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ..

Published : 23 Dec 2020 02:16 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆదిత్యనాథ్‌ దాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బిహార్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని డిసెంబర్‌ 31న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌ను ప్రభుత్వం నియమించింది. సీఎస్‌ రేసులో మరో ముగ్గురు అధికారులు ఉన్నప్పటికీ వారంతా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆదిత్యనాథ్‌ దాస్‌వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. ఉద్యోగ విరమణ అనంతరం సీఎస్‌ నీలం సాహ్నిని సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది.

దీంతో పాటు మరికొందరు ఐఏఎస్‌ అధికారుల బాధ్యతల్లోనూ మార్పు జరిగింది. ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎస్‌గా నియమితులైన నేపథ్యంలో జలవనరులశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి మారిన ఐఏఎస్‌ అధికారిని వై.శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా, కె. సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇవీ చదవండి..

‘కరోనా కొత్త రకం’ భారత్‌లో లేదు

‘పోలీసు వాహనాలకు వైకాపా రంగులా?’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని